ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ: రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు అలాగే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయాలపై ప్రధానితో సీఎం లోతుగా చర్చించారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీలతో కూడా ఆయన భేటీ అయి పలు అభివృద్ధి అంశాలపై విజ్ఞప్తులు సమర్పించారని సమాచారం.