ఎన్నికల బహిష్కరణ: సర్పంచ్ రిజర్వేషన్ మార్పును నిరసిస్తూ గ్రామస్థుల ఆందోళన
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనకాపల్లి
సర్పంచ్ రిజర్వేషన్ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా రొంగలివానిపాలెం గ్రామస్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో తొలుత బీసీ మహిళకు కేటాయించిన స్థానాన్ని ఎస్సీ మహిళకు మార్చడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మొత్తం ఎనిమిది వందల ఇరవై ఓట్లకు గాను కేవలం ఇద్దరు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు మాత్రమే ఓట్లు వేశారు.