భారీ సంచలనం: న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత అండర్-20 రగ్బీ మహిళలు

రిపోర్టర్: రాము స్థలం: બિહાર

భారత అండర్-20 మహిళల రగ్బీ సెవెన్స్ జట్టు సంచలన విజయం సాధించిందని క్రీడా వర్గాలు తెలిపాయి. బిహార్ లోని రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పదిహేడు సున్నా తేడాతో న్యూజిలాండ్ మావోరీ ఆహ్వానిత జట్టును భారత్ చిత్తు చేసింది. రగ్బీ క్రీడా ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశంపై మన అమ్మాయిలు సాధించిన ఈ చారిత్రక విజయం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందించారు.