చంద్రబాబు పాలనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

అధికారులమని చెబుతూ సైబర్ నేరాల హెచ్చరికల తరహాలోనే చంద్రబాబు పాలనపై సరికొత్త సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎఫ్‌బీఐ ప్రతినిధులమని బెదిరిస్తూ సోషల్ మీడియా ఖాతాలను మూసివేయమని నోటీసులు ఇచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కొత్త కాలర్‌ట్యూన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎద్దేవా చేస్తూ వస్తున్న ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.