ఆంధ్రప్రదేశ్ లో పడిపోయిన సంతానోత్పత్తి రేటుపై ఈఏసీ పీఎం కీలక నివేదిక

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో సంతానోత్పత్తిని తగ్గించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఈఏసీ పీఎం తన నివేదికలో వెల్లడించింది. ఏపీలో వివాహిత మహిళల్లో 69.5 శాతం మంది కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4కి పడిపోయిందని, జనాభా నియంత్రణ నుంచి నిర్వహణ వైపు సర్కార్ అడుగులు వేస్తోందని నివేదిక పేర్కొంది.