ముంబై ఐఐటీ విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసులో సీసీటీవీ దృశ్యాల గుర్తింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: ముంబై
ముంబై ఐఐటీ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలకమైన సీసీటీవీ పుటేజీని సేకరించారు. సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ పరీక్ష సమయంలో సాహిల్ మొబైల్ ఫోన్ వాడుతూ కాపీ కొడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ అతన్ని పట్టుకుని బయటకు పంపినట్లు పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.