గ్రామ ప్రజల శ్రేయస్సు కోరుతూ భక్తిశ్రద్ధలతో అన్నాసత్రం
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ మండలం రామడుగు గ్రామంలో శివాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నాసత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ వినాయకుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వినాయకుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టామని వారు వెల్లడించారు.