బ్రిటన్‌లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

రిపోర్టర్: రాజేష్ స్థలం: వరల్డ్

బ్రిటన్‌లోని స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, ఉత్తర ఇంగ్లాండ్ ప్రాంతాలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కాట్లాండ్‌లోని ప్రెస్విక్ సెంటర్‌లో ఇంజనీర్లు ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు నాట్స్ సంస్థ వెల్లడించింది. మాంచెస్టర్‌కు దక్షిణంగా ఉన్న విమానాశ్రయాలు సాధారణంగానే పనిచేస్తున్నప్పటికీ, ఉత్తర ప్రాంతానికి వెళ్లే విమానాలు, స్కాటిష్ విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.