వ్యక్తుల కంటే వ్యవస్థకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం నేత లోకేశ్ స్పష్టత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మంగళగిరి
ఐటీడీపీలో వ్యక్తుల కంటే వ్యవస్థకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఐటీడీపీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని, సాంకేతికంగా సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.