అమెరికా రాజకీయాల్ లో కలకలం: 2028 అధ్యక్ష రేసుపై జేడీ వాన్స్ వ్యూహాలు

రిపోర్టర్: హరి స్థలం: వాషింగ్టన్

అమెరికా రాజకీయాల్ లో 2028 అధ్యక్ష ఎన్నికల వేడి ఇప్పుడే రాజుకుంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై అసంతృప్తితో ఉన్న ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సరికొత్త రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానాలపై ట్రంప్ వైఖరికి భిన్నంగా స్పందిస్తూ వాన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిర్మించుకునే ప్రయత్నాల్ లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.