మెదక్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మెదక్
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ నేరుగా రంగంలోకి దిగారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద స్వయంగా ఉండి బందోబస్తు విధులను పర్యవేక్షిస్తున్నట్లు మెదక్ జిల్లా పోలీస్ వెల్లడించారు. శోభాయాత్ర సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.