పెద్దబాయి తండా గృహప్రవేశంలో సందడి చేసిన భాస్కర్ నాయక్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జడ్చర్ల

జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజాసేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవకుడు జర్పూల భాస్కర్ నాయక్ పెద్దబాయి తండాలో నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమానిని, కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.