పెసర రైతులకు తప్పని కష్టాలు, మద్దతు ధర కరువు
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో పెసర పంటకు సరైన మద్దతు ధర లభించక రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. కేంద్రం క్వింటాలుకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించినా, మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా రూ.7,600 మాత్రమే పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.