దివ్యాంగుల జీవితాల్లో ఆశల దీపాలు వెలిగిస్తున్న పువ్వాడ ఫౌండేషన్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం అర్బన్ పరిధిలో రోటరీ క్లబ్ మరియు పువ్వాడ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ 88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు అందజేశారు. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పద్నాలుగేళ్లలో వేయి మందికి పైగా లబ్ది చేకూర్చినట్లు పేర్కొన్నారు.