రాజాపేట మండలంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామ పంచాయతీ వద్ద శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన సాహసోపేత పోరాటాలను గుర్తుచేసుకుంటూ నాయకులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవనీత నరసింహులు, మాజీ సర్పంచ్ గుంటీ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దండే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.