నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా రూ. 8.76 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను గుర్తించి లక్ష్మీభాస్కర్ ను ఏసీబీ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు.