కొత్త సీటీవో కఠిన నిబంధనలతో ఉద్యోగుల మాలీషియస్ కంప్లయన్స్

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

కంపెనీ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీటీవో వ్యవహారశైలిపై ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారని రెడ్ డిట్ వేదికగా ఒక యూజర్ వెల్లడించారు. సాయంత్రం అయిదు గంటలు దాటితే ఎటువంటి అత్యవసర సేవలందించబోమని స్పష్టం చేస్తూ టెక్కీలు నిబంధనలను అక్షరాలా పాటించడంతో సంస్థలో పెద్ద సంక్షోభం తలెత్తిందని, దీనివల్ల కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు.