ఏర్పేడులో వేడుకగా వినాయక నిమజ్జనం లడ్డు దక్కించుకున్న భక్తులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఏర్పేడు
ఏర్పేడు మండల కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం జరిగిన లడ్డు వేలంలో పల్లె వీధికి చెందిన గాదే రాజేశ్వరి మల్లికార్జున్ రెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి లక్షా ముప్పై ఐదు వేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో విజేతను మేళతాళాలతో సత్కరించారు. తులసి మెడికల్స్ అధినేత భాస్కర్ రాయల్ ఆధ్వర్యంలో భక్తులు భారీ సంఖ్యలో నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.