ఏపీలో రేషన్ బియ్యం నాణ్యత పెంపు: ఇకపై 10 శాతం నూకలే

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం నాణ్యతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సార్టెక్స్ సాంకేతికతతో నూకల శాతాన్ని 10 శాతానికి తగ్గించింది. బహిరంగ మార్కెట్లో రూ. 70 విలువ చేసే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే 17 జిల్లాల్లో అమలవుతున్న ఈ ప్రక్రియను, రాబోయే రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ వేగంగా చర్యలు చేపట్టింది.