తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమ వ్యవహారంపై క్లారిటీ!

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి వినాయక విగ్రహం ముందు పూజలు నిర్వహిస్తున్న ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోతో వారిద్దరి ప్రేమ నిజమేనని స్పష్టత వచ్చింది. త్వరలోనే వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.