దానం అనర్హత తీర్పును స్వాగతించిన భారతీయ జనతా పార్టీ

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించి చేసిన పోరాటానికి ఇది దక్కిన నిజమైన విజయం అని పేర్కొంది. ఒక పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌ను కాపాడేందుకు స్పీకర్ యత్నించారని ఆరోపించింది.