దిగ్గజ మేకప్ ఆర్టిస్ట్ పాండియన్ కన్నుమూత: పరిశ్రమలో తీవ్ర విషాదం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Chennai
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ పాండియన్ వయసురీత్యా చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో చిత్రసీమలో విషాదం అలుముకుంది. కేరళలోని నాగేంద్రకోవిల్ కు చెందిన పాండియన్ తన పదహారేళ్ల ప్రాయంలోనే మేకప్ రంగంలోకి అడుగుపెట్టారు. అనేక చిత్రాలకు ఆయన మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.