ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు: వైఎస్ జగన్ కేసులపై రోజువారీ విచారణకు ఆదేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

వైఎస్ జగన్కు సంబంధించిన ఐదు కీలక కేసుల్లో ఒకే రోజు వేర్వేరు పరిణామాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీ విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుల ఆస్తులను ఈడీ జప్తు చేయగా, పలువురు ప్రముఖులకు సమన్లు జారీ కావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది.