మధుయాష్కీ గౌడ్తో రాహుల్ గాంధీ భేటీ: సంస్థాగత విస్తరణపై కీలక చర్చలు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థాగత విస్తరణ, దేశవ్యాప్తంగా విధివిధానాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. నూతన బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.