విద్యుత్ ఉద్యోగులకు దీపావళి కానుక: డీఏ పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు మరియు పింఛనుదారులకు కరువు భత్యం పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీపావళి పండుగకు ముందే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెంపు ద్వారా నాలుగు ప్రధాన విద్యుత్ సంస్థల పరిధిలోని డెబ్బై ఒక్క వేల మందికి పైగా సిబ్బందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల ప్రభుత్వంపై నెలకు పద్నాలుగు కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.