ఇంద్రకీలాద్రిపై అరుదైన సంప్రదాయం: పోలీసుల బేడ బంధం

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అరుదైన సంప్రదాయం కొనసాగుతోంది. కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి పోలీసులు ప్రతి ఏటా పట్టుచీర, సారె సమర్పిస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ రావిచెట్టు వద్ద పూజలు నిర్వహించి అమ్మవారికి తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కులమతాలకు అతీతంగా సిబ్బంది అంతా ఈ వేడుకల్లో పాల్గొంటూ భక్తి బాధ్యతలను చాటుకుంటున్నారు.