పల్నాడు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడిపై అఘాయిత్యం

రిపోర్టర్: మహేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఎనిమిదేళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆడుకుందామని బయటకు తీసుకెళ్లి ఈ అరాచకానికి ఒడిగట్టారు. బాలుడు ఏడుస్తుండగా గుర్తించి తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.