తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిన టీటీడీ
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈనెల పన్నెండు నుండి ఇరవయ్యవ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని అధికారులు తెలిపారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి వచ్చే అధికమాసం సందర్భంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.