అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

అరెస్టు చేసిన నిందితులకు కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయకపోవడం, లాయర్‌ను సంప్రదించే అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 22(1) ప్రకారం నిందితుడిని అరెస్టు చేసిన 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని, ఇవి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే ముఖ్యమైన సూత్రాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిబంధనలు ఉల్లంఘించే పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.