విమానాల ప్రమాదాలకు చెక్ పెట్టేలా ఐఐటీ మద్రాస్ కొత్త టెక్నాలజీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తమిళనాడు
విమానాలు గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వేగం కోల్పోయి కూలిపోయే ప్రమాదాలను నివారించడానికి ఐఐటీ మద్రాస్ పరిశోధకులు సరికొత్త రెక్కల డిజైన్‌ను అభివృద్ధి చేశారు. పక్షుల కదలికల స్ఫూర్తితో రూపొందించిన ఈ ఫ్లెక్సిబుల్ వింగ్ అటాచ్‌మెంట్, గాలి ప్రవాహానికి తగినట్లుగా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల విమానాలు స్టాల్ సమస్య నుంచి పూర్తిగా రక్షించబడి, అత్యవసర పరిస్థితుల్లోనూ సురక్షితంగా ప్రయాణించడానికి వీలవుతుంది.