హిందూ సమాజాన్ని కాంగ్రెస్ విడగొడుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు మండిపాటు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Nalgonda, Telangana

నల్గొండ జిల్లా చిన్న మేడారం గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పంట పొలాలను సందర్శించి, కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి దేవుడిపై నమ్మకం లేదని, అందుకే దేవుడి పేరు మీద ప్రమాణస్వీకారం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే చెప్పారని, హిందూ సమాజాన్ని విడగొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.