కళింగ ఇన్స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు విద్యాసంస్థ వర్గాలు వెల్లడించాయి. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.