టెలికాం వినియోగదారులకు ముప్పై రోజుల వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ముప్పై రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. టెలికాం వినియోగదారుల సెక్యూరిటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. గతంలో మాదిరిగా ఏడాదికి పమూడు సార్లు కాకుండా ఇకపై కేవలం పన్నెండు సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ని కోరినట్లు ఆయన వివరించారు.