గిరిజనుల నిధులను మళ్లించిన వైకాపా సర్కార్‌పై కూటమి ప్రభుత్వం ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన రూ.175 కోట్ల నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని గిరిజన సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ 275(1) కింద కేటాయించిన ఈ నిధులతో రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలల మౌలిక వసతులు నిర్మించాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టించారని అధికారులు తెలిపారు. తాజాగా ఆ నిధులను వినియోగించి సత్వరమే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.