కేఎంసీలో మెడికల్ సీటు సాధించిన విద్యార్థిని హిమబిందుకు ఘన సత్కారం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన దాసరి హిమబిందు నీట్ పరీక్షలో 600వ ర్యాంకు సాధించి కాకతీయ మెడికల్ కాలేజీలో ఉచిత మెడిసిన్ సీటు పొందింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్ విద్యార్థిని హిమబిందును, ఆమె తల్లిదండ్రులు భిక్షపతి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ప్రతిభ చూపి వర్ధన్నపేట ఖ్యాతిని పెంచిందని, భవిష్యత్తులో ఆమె ఉత్తమ వైద్యురాలిగా సమాజానికి సేవ చేయాలని పలువురు నాయకులు కొనియాడారు. ఈ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.