విశాఖపట్నంలో త్వరలో పదహారు ఫైవ్ స్టార్ హోటల్స్ రానున్నాయి
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటల్స్ రానున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలో ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్‌పోను మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కొత్త హోటళ్ల నిర్మాణం వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.