పింఛన్ల పంపిణీలో కొత్త విధానం: నేటి నుంచి లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర వాటాలు వేర్వేరుగా జమ

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

పింఛన్ల పంపిణీ పథకంలో నవంబర్ మొదటి తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వేర్వేరుగా లబ్ధిదారులకు అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాను నేరుగా ఇళ్లవద్దే సచివాలయ సిబ్బంది నగదు రూపంలో అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ వాటాను మాత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా జమ చేయనున్నారు. ఈ కొత్త మార్పులతో లబ్ధిదారులు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలని అధికారులు సూచించారు.