జనసేన పార్టీలోకి భారీగా వైయస్సార్సీపీ కాంగ్రెస్ నాయకుల చేరికలు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల నుంచి వైయస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. దిగవలస, పెళ్లి, ఆర్జీ కొత్తూరు, రాళ్లగడ్డ, గుంజివీధి, కప్పగుంది, జోహారు తదితర గ్రామాల నుంచి వచ్చిన వారికి జనసేన మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.