వైఎస్సార్ కడప జిల్లాలో నిధుల దుర్వినియోగం: ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా
రిపోర్టర్: సునీల్
స్థలం: వైఎస్సార్ కడప
వైఎస్సార్ కడప జిల్లాలో రూ.88.58 లక్షల సీజినరేజ్ ఫీజుల నిధుల ఉపసంహరణ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం వెల్లడించింది. నిబంధనల ఉల్లంఘన మరియు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇంక్రిమెంట్ల కోతతో పాటు మందలింపు శిక్షలు విధిస్తూ మూడు వేర్వేరు జీవోలను జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.