ధర్మవరంలో ఉద్రిక్తతలపై సత్యకుమార్ ధ్వజం: వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణలపై మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్రిక్తతల వెనుక వైసీపీ నాయకుల పాత్ర ఉందని ఆయన మండిపడ్డారు. కావాలనే వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు తావులేదని, హద్దు మీరి వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.