హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

హిందూ పండుగలకు కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇతర వర్గీయుల పండుగలను మాత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించి, భారీగా తోఫాలు అలాగే కానుకలు అందజేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైన గౌరవం దక్కాలని, హిందూ సంప్రదాయాలను విస్మరిస్తే ప్రజా ఆగ్రహం తప్పదని బీజేపీ తెలంగాణ నేతలు హెచ్చరించారు.