అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత
రిపోర్టర్: శివ
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బందోబస్తు సిబ్బంది తమపై దాడి చేశారని ఆరోపించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో భక్తులు నిరసన విరమించి నిమజ్జన యాత్రను ప్రశాంతంగా కొనసాగించారు.