రెండోసారి తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ దీపిక

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సెప్టెంబర్ 19న తమకు మరో పాప జన్మించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ జంట అధికారికంగా ప్రకటించారు. బేబీ ఫీట్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్‌లో రణ్‌వీర్, దీపికతో పాటు పెద్ద కుమార్తె దువా పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఈ గుడ్ నూస్ చెప్పడంతో అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.