పెట్రోల్ లో పరిమితికి మించి ఇథనాల్: వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని కర్ణాటక డిమాండ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బెంగళూరు
పెట్రోల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకంటే ఎక్కువగా ఇథనాల్ కలుపుతున్నారని కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్ లో సేకరించిన శాంపిళ్లలో ఇథనాల్ మిశ్రమం ఏకంగా 31 శాతానికి చేరిందని ల్యాబ్ పరీక్షల్ లో తేలిందని ఆయన తెలిపారు. దీనివల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని మంత్రి డిమాండ్ చేశారు.