నా జీవితంలో ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదంటూ హీరో ఫహాద్ ఫాజిల్ వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
అక్టోబర్ రెండున విడుదల కానున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా కథ విన్న వెంటనే నచ్చిందని నటుడు ఫహాద్ ఫాజిల్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, మలయాళం నుండి తెలుగులోకి డైలాగ్స్ మార్చుకుని నటించడం తనకు సవాల్గా అనిపించిందని పేర్కొన్నారు. రియల్ లొకేషన్లలో షూటింగ్ చేయడం ఎంతో నచ్చిందని, ఈ చిత్రంలో తన పాత్ర జర్నీ కొత్తగా ఉంటుందని, కాలభైరవ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని ఫహాద్ ఫాజిల్ వివరించారు.