ఖైరతాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ కసరత్తు

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ ఉపఎన్నికను గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఓటముల తర్వాత ఖైరతాబాద్లో గెలిచి తీరాలని బీఆర్ఎస్ భావిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఈ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు మన్నె గోవర్ధన్రెడ్డి, దాసోజు శ్రవణ్, విష్ణువర్ధన్రెడ్డితో పాటు తలసాని సాయికిరణ్ రేసులో ఉన్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై కారు పార్టీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.