అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్ ఎక్స్ షేరు ఉచితం: ఎలాన్ మస్క్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Washington
అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్ ఎక్స్ కంపెనీలో ఒక వాటాను ఉచితంగా అందజేస్తామని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే ఆస్తి హక్కు, స్పేస్ టెక్నాలజీపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ ప్రకటనపై సర్వత్రా చర్చ సాగుతోంది.