హస్తినలో నకిలీ జర్నలిస్టుల దందా గుట్టురట్టు: ఆన్లైన్లో ప్రెస్ ఐడీల విక్రయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది ఇస్తే చాలు ఎవరికైనా ప్రెస్ ఐడీ కార్డులు, మైక్ కిట్లు విక్రయిస్తున్న నకిలీ జర్నలిస్టుల ముఠా గుట్టును ఓ జాతీయ మీడియా స్టింగ్ ఆపరేషన్లో రట్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో కొందరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఈ భారీ మోసం వెలుగు చూసిందని, దీనివల్ల జర్నలిజం విశ్వసనీయత దెబ్బతినడంతో పాటు సమాజ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని పరిశోధనా బృందం ఆందోళన వ్యక్తం చేసింది.