రొమ్ము క్యాన్సర్కు గడ్డలే కాదు: మహిళలు తప్పక గమనించాల్సిన కీలక మార్పులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

మహిళలను వేధిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్పై ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ నిపుణులు డాక్టర్ అశ్విన్ కె. ఆర్ కీలక విషయాలు వెల్లడించారు. రొమ్ములో గడ్డ ఏర్పడకపోయినా శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని ఆయన తెలిపారు. చర్మం మందంగా మారడం, చనుమొనలో తేడాలు, ద్రవాలు కారడం వంటి లక్షణాలను తేలికగా తీసుకోకుండా మహిళలు వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆయన హెచ్చరించారు.