విశాఖలో సీఎం సభ వద్ద స్నాక్స్ కోసం గలాటా

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం సభ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ కోసం దూర ప్రాంతాల నుంచి లబ్ధిదారులను, మహిళలను అధికారులు ఉదయాన్నే రప్పించారు. భోజన సమయం కావడంతో ఆకలితో అల్లాడిన జనం స్నాక్స్ తీసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం, తోపులాట నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.